ఆర్ఆర్ బీ ఉద్యోగాల జాతర.. రైల్వే జాబ్ సాధించేందుకు సరైన సమయం ఇదే!

  • 8 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
  • గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం
  • క్లర్క్, మేనేజర్, స్టేషన్ మాస్టర్, అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీ
రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బీ) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపింది. గ్రాడ్యుయేట్‌,‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందులో 5 వేల గ్రాడ్యుయేట్ పోస్టులు కాగా మిగతావి అండర్ గ్రాడ్యుయేట్‌ పోస్టులు. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు అక్టోబర్‌ 21 నుంచి, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు అక్టోబర్‌ 28 ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. జోన్లు, విభాగాల వారీగా ఖాళీల వివరాలను త్వరలో విడుదల చేయనున్న వివరణాత్మక నోటిఫికేషన్‌ లో వెల్లడిస్తామని తెలిపింది.

ఏయే రీజియన్లంటే..
సికింద్రాబాద్, చెన్నై, ముంబై, గువాహటి, గోరఖ్‌పుర్, అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, జమ్ముశ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం.
 
భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్

అర్హతలు..
గ్రాడ్యుయేట్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి
వయోపరిమితి..
18 నుంచి 33 సంవత్సరాలు (గ్రాడ్యుయేట్‌ పోస్టులు) 
18 నుంచి 38 సంవత్సరాలు (అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు) 
 
ముఖ్యమైన తేదీలు..
గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ అక్టోబర్‌ 21, చివరి తేదీ 2025 నవంబరు 20.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ప్రారంభ తేదీ అక్టోబర్ 28, చివరి తేదీ 2025 నవంబర్‌ 27.


More Telugu News