Manasa Varanasi: మానస వారణాసి అదృష్టం మామూలుగా లేదే!

Manasa Varanasi Special
  • తెలంగాణ బ్యూటీగా మానస వారణాసి 
  • 'కపుల్ ఫ్రెండ్లీ'తో దక్కిన హిట్ 
  • ఒక్కసారిగా పెరిగిన క్రేజ్
  • కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నట్టు టాక్
        
వెండితెరపై హీరోయిన్ గా కనిపించాలంటే అందం ఒక్కటే వుంటే సరిపోదు .. అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ఎంతటి గ్లామర్ ఉన్నప్పటికీ .. టాలెంట్ ఉన్నప్పటికీ .. స్టార్ డమ్ దక్కడం అంత తేలికగా జరగదు. చాలామంది హీరోయిన్స్ తమ సినిమా హిట్ అయితే చాలు, తమ మార్కెట్ .. పారితోషికం పెరిగిపోతుందని అనుకుంటారు. కానీ సినిమా హిట్ అయినా ఒక్కోసారి ఆ క్రెడిట్ ఎవరి ఎకౌంటులోకో వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే అంటారు అదృష్టం కూడా ఉండాలని. 

హీరోయిన్స్ ఒకప్పటి మాదిరిగా తెరపై ఎక్కువ కాలం పాటు రాజ్యం చేసే పరిస్థితి లేదు. అందువలన ప్రతి సినిమా వాళ్లకి చాలా విలువైనదిగానే కనిపిస్తూ ఉంటుంది. హిట్ అయిన సినిమాతో మరింత పాప్యులర్ కావాలనే కోరుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి మొదటి ప్రయత్నం నిరాశపరిచినా, రెండో ప్రయత్నంతో దశ తిరిగిపోతూ ఉంటుంది. అలాంటి అందాల నాయికల జాబితాలో తాజాగా మానస వారణాసి పేరు కూడా చేరిపోయింది.

మానస వారణాసి తెలంగాణ అమ్మాయి. అనేక అందాల పోటీలలో బహుమతులు గెలుచుకున్న నాజూకు నాయిక. 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా తరువాత అంతా ఈ బ్యూటీని గురించే మాట్లాడుకుంటున్నారు. పొన్నాగి పూలతో పోతబోసినట్టు .. తామర రేకులతో రాశి పోసినట్టుగా కనిపించే ఈ సుందరి పేరు ఇప్పుడు యూత్ జపించే మధురమైన మంత్రమైపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిపోటీలేదు. ఇలాంటి సమయంలో ఎంట్రీ ఇవ్వడం ఈ భామకి కలిసొచ్చే విషయం. యంగ్ హీరోలంతా తమ ప్రాజెక్టుల కోసం ఇప్పుడు ఈ బ్యూటీని రికమెండ్ చేస్తున్నట్టుగా టాక్. సౌందర్యానికి సరైన అర్థంలా కనిపించే మానస వారణాసి, మున్ముందు మరెన్ని మహిమలు చేస్తుందో చూడాలి. 

Manasa Varanasi
Couple Friendly Movie
Telugu Actress
Tollywood
Telangana
Beauty Pageant Winner
Indian Cinema
Glamour
Young Heroes
Film Projects

More Telugu News