ఏడేళ్ల నాటి జొమాటో బిల్ ఫొటో వైరల్.. కారణం ఇదే!
- అప్పట్లో డిస్కౌంట్లతో బిల్లు తగ్గేదంటున్న నెటిజన్లు
- ఇప్పుడు డిస్కౌంట్ల పేరుతో కంపెనీ గిమ్మిక్కులు చేస్తోందని విమర్శ
- రేట్ల పెంపునకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమూ ఓ కారణమేనంటున్న యూజర్లు
ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో తక్కువ ధరలతో అందరికీ అందుబాటులో ఉండేవి. రోజురోజుకూ రేట్లు పెంచుకుంటూ ఇప్పుడు భారీ మొత్తాలతో వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయని ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. రెడ్డిట్ లో ఓ యూజర్ పెట్టిన పోస్టే దీనికి కారణం. 2019లో జొమాటోలో తాను ఆర్డర్ చేసిన పన్నీర్ టిక్కాకు రూ.92 లు మాత్రమే చెల్లించానంటూ ఓ యూజర్ అప్పటి బిల్ ఫొటోను పోస్ట్ చేశారు. అప్పట్లో జొమాటోతో పాటు మిగతా ఫుడ్ డెలివరీ యాప్ లు తక్కువ ధరలతో అందరికీ అందుబాటులో ఉండేవని గుర్తుచేసుకున్నారు.
కూపన్ డిస్కౌంట్ తో అప్పట్లో బిల్ తగ్గేదని, ఇప్పుడు మాత్రం పేరుకు డిస్కౌంట్ ఇస్తున్నా బిల్ మాత్రం తగ్గడంలేదని ఆరోపించారు. అప్పట్లో రూ.92 లకు వచ్చిన పన్నీర్ టిక్కా ఇప్పుడు రూ.300 ల కంటే తక్కువకు రావడంలేదని వాపోయారు. డెలివరీ ఛార్జీ, డైనమిక్ ఛార్జీ, రెయిన్ ఫీ, రెస్టారెంట్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయని ఫుడ్ డెలివరీ యాప్ లపై మండిపడ్డారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. అప్పటికి, ఇప్పటికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆహార పదార్థాల రేట్లు పెరగడానికి ఓ కారణమని కామెంట్లు పెడుతున్నారు. 2019లో అమూల్ నెయ్యి 15 కిలోల టిన్ రూ.5,500 లకే లభించేదని, ఇప్పుడు అదే టిన్ రూ.9 వేలకు చేరిందని మరొక యూజర్ పేర్కొన్నారు. ధరలు పెరగడం వల్ల రేట్లు కూడా పెరిగాయని ఆయన అన్నారు.