హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో మంటలు

  • బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
  • ఎర్రమంజిల్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఘటన
  • ఘటన జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు
హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట పరిధిలో గల ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. ఎర్రమంజిల్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో కారులో పెట్రోల్ నింపుతుండగా మంటలు వ్యాపించాయి.

క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా, వారు వెంటనే అప్రమత్తమై కారు దిగి సురక్షితంగా బయటపడ్డారు. పెట్రోల్ బంకు సిబ్బంది సమయస్పూర్తితో కారును బంకు నుంచి దూరంగా తరలించారు. కారు ముందు భాగం నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News