కేబినెట్ కూర్పు ఎఫెక్ట్.. నెల రోజుల్లోనే రాజీనామా చేసిన ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు సన్నిహితుడు సెబాస్టియన్ లెకోర్ను
- మంత్రివర్గ కూర్పుపై రాజకీయ విమర్శలు
- రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయడం గమనార్హం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సెబాస్టియన్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆదివారం నాడు ఆయన నూతన మంత్రివర్గాన్ని నియమించారు.
అయితే, ఈ మంత్రివర్గ కూర్పుపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కొద్ది గంటల్లోనే రాజీనామా చేశారు. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో లెమెయిర్‌ను తిరిగి రక్షణ మంత్రిత్వ శాఖలోకి తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగింది. ఆయన రాజీనామాను మాక్రాన్ ఆమోదించినట్లు ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.