రేబిస్ వ్యాధి కలకలం.. హైదరాబాద్‌లో బాలుడు మృతి
- బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుటుంబం
- రెండు నెలల క్రితం కుక్కకాటుకు గురైన శ్రీనివాస్ కొడుకు
- రెండు రోజుల క్రితం అస్వస్థతతో తార్నాకలోని ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు శ్రీచరణ్
రెండు నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్‌ను కుక్క కరిచింది. వెంటనే అతనికి ఇంజక్షన్ కూడా చేయించారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీచరణ్ అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు తార్నాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీచరణ్ మృతి చెందాడు.