రేబిస్ వ్యాధి కలకలం.. హైదరాబాద్‌లో బాలుడు మృతి

  • బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుటుంబం
  • రెండు నెలల క్రితం కుక్కకాటుకు గురైన శ్రీనివాస్ కొడుకు
  • రెండు రోజుల క్రితం అస్వస్థతతో తార్నాకలోని ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు శ్రీచరణ్
తెలుగు రాష్ట్రాల్లో రేబిస్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన మైదం శ్రీనివాస్ కుటుంబం జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది. ప్రస్తుతం ఈ కుటుంబం మాదాపూర్‌లో నివాసం ఉంటోంది.

రెండు నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్‌ను కుక్క కరిచింది. వెంటనే అతనికి ఇంజక్షన్ కూడా చేయించారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీచరణ్ అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు తార్నాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీచరణ్ మృతి చెందాడు.


More Telugu News