ప్లాట్ ఫాం పైకి చేరుకోవడానికే 2 గంటలు.. ఎల్బీ నగర్ మెట్రో కిటకిట.. వీడియో ఇదిగో!

  • ప్రయాణికుల ధాటికి మొరాయించిన ఎస్కలేటర్
  • క్యూ పద్దతిలో ప్రయాణికుల్ని పంపుతున్న మెట్రో సిబ్బంది
  • మెట్రో స్టేషన్ బయట కిలోమీటర్ మేర జనం క్యూ
దసరా పండుగకు ఊరు వెళ్లిన నగర వాసులు సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాలతో జనం రోడ్డెక్కారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ క్రమంలోనే బస్సుల్లో సిటీకి చేరుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు జనం పోటెత్తారు. ఎంతగా అంటే ప్రయాణికుల ధాటికి తట్టుకోలేక.. ఈ భారం మోయలేమంటూ ఎస్కలేటర్లు మొరాయించాయి.

మెట్రో స్టేషన్ లో ఇసుకవేస్తే నేలపై రాలనంత రద్దీ నెలకొంది. టికెట్ తీసుకోవడానికి, తీసుకున్నాక ప్లాట్ ఫాం పైకి చేరుకోవడానికి ఏకంగా రెండు గంటల సమయం పడుతోంది. స్టేషన్ బయట కిలోమీటర్ మేర ప్రయాణికులు క్యూ కట్టారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కు భయపడి మెట్రోను ఆశ్రయిస్తే.. మెట్రో స్టేషన్ లోనే భారీగా రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.


More Telugu News