విజయవాడ– హైదరాబాద్ హైవేపై రెండో రోజూ అదే సీన్.. తగ్గని వాహనాల రద్దీ

  • 4 కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు
  • ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికుల అవస్థలు
  • వంతెన నిర్మాణ పనుల వల్ల నెమ్మదిగా కదులుతున్న వెహికల్స్
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు తిరుగు ప్రయాణంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండో రోజు కూడా ట్రాఫిక్ తగ్గకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ సమస్య తలెత్తింది. పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. చింతలకుంట ఫ్లైఓవర్ మీద ట్రావెల్స్‌ బస్సులు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.


More Telugu News