తలనొప్పిగా ఉందని లీవ్ అడిగితే.. ఇది స్కూల్ అనుకున్నావా? అంటూ మేనేజర్ రిప్లై
- టాబ్లెట్ వేసుకుని ఆఫీసుకు వచ్చేయాలని సూచన
- డోలో వేసుకున్నా తగ్గలేదని, రాలేనంటూ ఉద్యోగి మెసేజ్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాట్సాప్ స్క్రీన్ షాట్
తలనొప్పిగా ఉంది ఆఫీసుకు రాలేనంటే మా మేనేజర్ ఏమని జవాబిచ్చాడో మీరే చూడండంటూ ఓ ఉద్యోగి తన వాట్సాప్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. కేవలం తలనొప్పికి లీవ్ ఇవ్వడం కుదరదని, ఓ టాబ్లెట్ వేసుకుని ఆఫీసుకు వచ్చేయాలని సదరు మేనేజర్ జవాబిచ్చాడు. ఇంకా స్కూల్లో చదువుతున్నానని అనుకుంటున్నావా.. ఇది ఆఫీసు, ఇప్పుడు నువ్వు కంపెనీలో ఒక భాగం, తప్పకుండా ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు.
దీంతో విసిగిపోయిన ఆ ఉద్యోగి, ‘‘ఎవరైనా తలనొప్పితో ఎలా పనిచేయగలరు?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సిక్ లీవ్ తీసుకునే హక్కు మీకు ఉందని సలహా ఇస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగికి సెలవు ఇవ్వకపోవడం అమానుషమని మండిపడుతున్నారు.
వాట్సాప్ లో జరిగిన సంభాషణ ఇదిగో..
ఉద్యోగి: సార్, తలనొప్పిగా ఉంది. ఈరోజు ఆఫీసుకు రాలేను.
మేనేజర్: తలనొప్పే కదా? దానికి సెలవు ఎందుకు? టాబ్లెట్ వేసుకుని వచ్చేసెయ్.
ఉద్యోగి: డోలో టాబ్లెట్ వేసుకున్నా సర్. అయినా తగ్గలేదు. ఆఫీసుకు రాలేను.
మేనేజర్: ఏం మాట్లాడుతున్నావయ్యా బాబూ? స్కూలులో ఉన్నానని అనుకుంటున్నావా? తలనొప్పికి సెలవు ఇవ్వడం కుదరదు. టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుందిలే. ఆఫీసుకు వచ్చేయ్.
ఉద్యోగి: టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు.. రావడం కుదరదేమో.
మేనేజర్: ఇప్పుడు నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు. అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకుని, కొద్దిగా ఆలస్యంగా రా పర్లేదు. కానీ ఆఫీసుకు రావాల్సిందే.
ఉద్యోగి: ట్రై చేస్తా.