ఈ బంధం విడదీయరానిది.. తారల రీయూనియన్ ఫొటోలతో మెగాస్టార్

  • చెన్నైలో కలుసుకున్న అలనాటి తారలు
  • చిరంజీవి, వెంకటేశ్ సహా మొత్తం 31 మంది నటులు
  • దక్షిణాదితోపాటు 80ల నాటి ఉత్తరాది నటులు కూడా హాజరు
‘నా ప్రియమైన స్నేహితులతో ప్రతీ రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుంది’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. 80ల నాటి తారల రీయూనియన్ ఫొటోలను పంచుకుంటూ మెగస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని ఆయన అన్నారు. తమ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిదని చెప్పారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే.

చెన్నైలో వరదల కారణంగా గతేడాది వాయిదా పడింది. తాజగా ఈ నెల 4న దక్షిణాది, ఉత్తరాది నటులు మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకుంటూ.. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది.

ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుందని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, నరేశ్‌, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు పాల్గొన్నారు.


More Telugu News