రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అంటాను: కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు
- ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించిన కన్హయ్య కుమార్
- దొంగతనం చేసిన వారిని దొంగలు అంటారని వ్యాఖ్య
- తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అంటారన్న కన్హయ్యకుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కన్హయ్య కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన ఒక మూర్ఖుడని ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలివితక్కువగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
బీహార్ ప్రజలను కూలీలు అని వ్యాఖ్యానించడం సరికాదని కన్హయ్య కుమార్ అభిప్రాయపడ్డారు. దొంగతనం చేసిన వారిని దొంగలు అని, తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అనడంలో తప్పేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి తమ పార్టీ ముఖ్యమంత్రి అయినా తాను భయపడనని, ఆయన మూర్ఖుడే అని కుండబద్దలు కొట్టారు.
త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రాహుల్ గాంధీ కూడా ఆయనను కాపాడలేరని శపథం చేశారు. తెలంగాణ ప్రజలకన్నా బీహార్ ప్రజల డీఎన్‌ఏ నాసిరకమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీహారీలను అవమానించినందుకు రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రశాంత్ కిశోర్ అన్నారు.