148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
- వెస్టిండీస్‌తో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డు నమోదు
- ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు 100 పరుగులకే ఔట్
- గతంలో ఇంగ్లాండ్‌పైనా సరిగ్గా వంద పరుగులకే పెవిలియన్
- 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడు
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. అయితే, ఈ సెంచరీతో పాటు 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు సరిగ్గా 100 పరుగుల వద్దే ఔటైన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. 197 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు సాధించిన అతను, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది (2025) రాహుల్ ఇలా 100 పరుగుల వద్ద ఔటవడం ఇది రెండోసారి. జులైలో ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో కూడా అతను సరిగ్గా 100 పరుగులకే వెనుదిరిగాడు. 1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఇలా 100 పరుగుల వద్ద ఔటవలేదు.
ఈ మ్యాచ్‌లో రాహుల్ సాధించింది అతని కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీ కాగా, స్వదేశంలో ఇది రెండోది మాత్రమే. 2016 తర్వాత భారత గడ్డపై అతను శతకం చేయడం ఇదే తొలిసారి.
మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ వంటి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. "విరామం తర్వాత తిరిగి మైదానంలోకి రావడం ఆనందంగా ఉంది. ఇంగ్లాండ్‌లో పరుగులు చేయడం మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇక్కడి పరిస్థితులు శారీరకంగా సవాలు విసిరాయి. ఈ సెంచరీని నా కూతురికి అంకితం ఇస్తున్నాను" అని రాహుల్ తెలిపాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.