తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ వీడియో విడుదల.. కౌంటర్ ఇచ్చిన డీఎంకే
- ఒక వీడియో చేయడానికి నాలుగు రోజులు పట్టిందా అని నిలదీత
- పలువురి మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్
- పోలీసుల మాట విని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న కనిమొళి
తమిళనాడులోని కరూర్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ విడుదల చేసిన వీడియో సందేశంపై అధికార డీఎంకే స్పందించింది. "ముఖ్యమంత్రి సార్, మీరు నాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏదైనా చేయండి, కానీ ప్రజల జోలికి వెళ్లకండి" అని విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీఎంకే, ఈ వీడియోను విడుదల చేయడానికి నాలుగు రోజులు పట్టిందా అని విమర్శించింది.
డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, అంతా రాసుకొచ్చి మాట్లాడుతున్నారని, ఒక వీడియో చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పలువురి మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తప్పు చేశాననే భావనతోనే ఆ తొక్కిసలాట జరిగిన స్థలం నుంచి విజయ్ వెళ్లిపోయాడని డీఎంకే ఎంపీ రాజా విమర్శించారు. టీవీకే నాయకులు పోలీసుల మాట విని ఉంటే ఈ దుర్ఘటన జరగకపోయి ఉండేదని మరో ఎంపీ కనిమొళి అన్నారు.