మొదటి బహుమతి మేకపోతు... దసరా పండుగకు షాపింగ్ మాల్స్ ఆసక్తికర ఆఫర్లు

  • కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ పట్టణ కేంద్రంలో వింత ఆఫర్
  • లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామని షాపింగ్ మాల్ యజమాని ప్రకటన
  • మొదటి బహుమతి మేకపోతు, రెండో బహుమతి మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటన
పండుగ వచ్చిందంటే చాలు, చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దసరా పండుగ సమయంలో ఇలాంటి ఆఫర్లు వెల్లువెత్తుతాయి. కొనుగోలు చేసే ఉత్పత్తులపై 10 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు ఉంటుందని ప్రకటనలు చేస్తుంటారు. ఈ ఆఫర్లు కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.

తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ పట్టణ కేంద్రంలో ఒక షాపింగ్ మాల్ యజమాని ఆసక్తికరమైన ఆఫర్లను ప్రకటించాడు. తమ దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా తీసి, మొదటి బహుమతిగా మేకపోతును, రెండవ బహుమతిగా మద్యం బాటిల్‌ను ఇస్తామని ఫ్లెక్సీ వేయించాడు. ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "ఈ విజయదశమికి షాపింగ్ చేయండి.. మేకపోతు లేదా మద్యం బాటిల్‌‍ను గెలుచుకోండి" అనే ప్రకటన చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


More Telugu News