38 కోట్లు కొల్లగొట్టిన టీనేజ్ లవ్ స్టోరీ .. ఓటీటీలో!

  • రీసెంటుగా రిలీజైన 'లిటిల్ హార్ట్స్'
  • రెండున్నర కోట్ల బడ్జెట్ 
  • రాబట్టింది 38 కోట్లు
  • ఓటీటీ హక్కులు ఈటీవీ విన్ కి  
  • అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్

ఒకప్పుడు మలయాళంలో మాత్రమే చిన్న సినిమాలు భారీవిజయాలను అందుకునేవి. ఆ తరువాత కాలంలో కోలీవుడ్ వైపు నుంచి కూడా అటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడమనేది ఇప్పుడు తెలుగులోనూ కనిపిస్తోంది. చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు అటు థియేటర్లలో .. ఇటు ఓటీటీలలో సంచలనాన్ని నమోదు చేస్తున్నాయి. 

అలాంటి సినిమాల జాబితాలో చేరిపోయిన మరో సినిమానే 'లిటిల్ హార్ట్స్'. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. మౌళి తనూజ్ .. శివాని నగరం .. జై కృష్ణ .. నిఖిల్ అబ్బూరి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, కేవలం రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది. అలాంటి ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి 38 కోట్లను కొల్లగొట్టింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది.

ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అఖిల్ - కాత్యాయని అనే ఇద్దరు స్టూడెంట్స్ మధ్య ఈ ప్రేమకథ నడుస్తుంది. పేరెంట్స్ .. టీనేజ్ పిల్లలు .. చదువులు .. ప్రేమలు అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందరికీ తెలిసిన విషయాలే అయినా, ఆ అంశాలను సరదాగా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే ఈ సినిమాకి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓటీటీ హక్కులు ఈటీవీ విన్ కి  లభించాయి. అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.



More Telugu News