అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్ లైన్ లో ప్రసాదం ఆర్డర్ చేసుకోవచ్చు!

  • మరో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్న శబరిమల దేవోసం బోర్డు
  • శబరిమల వరకూ వెళ్లలేని భక్తుల కోసం నిర్ణయం
  • ఆర్డర్ చేసిన వారికి ఇంటికే ప్రసాదం పంపిస్తామని వెల్లడి
అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల ఆలయ కమిటీ శుభవార్త తెలిపింది. శబరిమల వరకూ రాలేని భక్తులు తమ ఇంటి వద్దకే స్వామి వారి ప్రసాదాన్ని తెప్పించుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే స్వామి వారి ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తామని తెలిపింది. మరొక నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు ప్రకటించింది. కౌంటర్‌ బిల్లింగ్‌ మాడ్యూల్‌ సాయంతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

శబరిమలతో పాటు ట్రావెన్‌కూర్‌ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే సదుపాయాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. శబరిమల లాంటి దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు తెలిపింది. కౌంటర్‌ బిల్లింగ్‌ మాడ్యూల్‌ ఒక నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా దేవస్వోం బోర్డు అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News