2009 టీ20 ఫ్రైజ్ మనీ ఇప్పటికీ ఇవ్వలేదట.. పాక్ మాజీ క్రికెటర్ ఆరోపణ.. వీడియో ఇదిగో!
- పాక్ ప్రభుత్వంపై మండిపడ్డ సయీద్ అజ్మల్
- కప్ గెలిస్తే రూ.25 లక్షలు ఇస్తానని ప్రధాని హామీ
- జట్టు సభ్యులను ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ ఆరోపించాడు. రాజకీయ నాయకులు క్రికెటర్లను మోసం చేయడం పరిపాటిగా మారిందన్నాడు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత కప్ అందించే విషయంలో నెలకొన్న డ్రామా నేపథ్యంలో సయీద్ అజ్మల్ పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో పాక్ ప్రభుత్వంపై అజ్మల్ తీవ్ర విమర్శలు గుప్పించడం కనిపిస్తోంది.
2009లో టీ20 ఫైనల్ మ్యాచ్ కు ముందు అప్పటి ప్రధాని యూసుఫ్ రాజా గిలానీ తమకు ప్రైజ్ మనీ విషయంలో ఓ హామీ ఇచ్చారని అజ్మల్ చెప్పాడు. ఫైనల్ లో గెలిచి కప్పు అందుకుంటే జట్టు సభ్యులకు రూ.25 లక్షలు బహుమానం ఇస్తానని గిలానీ ప్రకటించారని ఆయన వెల్లడించారు. ఫైనల్ లో శ్రీలంకతో తలపడి తాము గెలిచామని, టీ20 కప్ ను పాకిస్థాన్ కు తీసుకు వచ్చామని అజ్మల్ వివరించారు.
కానీ, కప్ గెలిచిన తమ జట్టుకు ఐసీసీ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ మాత్రమే అందిందని, ప్రధాని గిలానీ ప్రకటించిన సొమ్ము మాత్రం ఇప్పటికీ అందలేదని చెప్పారు. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపించారు.