'జూనియర్' రాబట్టింది ఇదే .. ఓటీటీలో మొదలైన స్ట్రీమింగ్!

  • జులైలో థియేటర్లకు వచ్చిన 'జూనియర్'
  • 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా 
  • హైలైట్ గా నిలిచిన వైరల్ సాంగ్ 
  • డాన్సుల పరంగా మార్కులు కొట్టేసిన హీరో 
  • ఈ రోజు నుంచి ఆహాలో .. అమెజాన్ ప్రైమ్ లో

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి, 'జూనియర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జులై 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాను, 25 కోట్ల బడ్జెట్ లో నిర్మించగా, 16 కోట్లను మాత్రమే రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయింది. 

గాలి జనార్థన్ రెడ్డి పెద్ద వ్యాపారవేత్త కావడం .. కిరీటీ చాలా అణకువగా ఇంటర్వ్యూలలో .. ఈవెంట్స్ లో కనిపించడం .. శ్రీలీలతో పోటీపడి అతను డాన్సులు చేయడం .. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ .. శ్రీలీల గ్లామర్ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ సినిమాకి తెలుగు వైపు నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. హీరో హెయిర్ స్టైల్ విషయంలోనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'ఆహా'లోను .. అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ అవుతోంది. 

జీవితంలో వయసైపోయిన తరువాత, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను తలుచుకుంటూ మిగతా జీవితాన్ని గడపాలి. అందువలన అవమానాలకు భయపడి అనుభవాలను దూరం చేసుకోకూడదు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. పాటలు .. డాన్సులు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా 'వైరల్' సాంగ్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి.



More Telugu News