Naresh: కొన్ని పరిణామాల వల్ల సినిమా వేడుకల్లో మహిళలు చీరలు కడుతున్నారు: నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Naresh Comments on Saree Trend at Movie Events
  • 'హే భగవాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నరేశ్ వ్యాఖ్యలు
  • వాలంటైన్ వీక్‌లో భాగంగా హగ్ డే సందర్భంగా పురుషులను హగ్ చేసుకున్న నరేశ్
  • హగ్ చేసుకోవాలనుకున్నాను కానీ మీరు లక్షణంగా చీరలో వచ్చారని వ్యాఖ్య
సుహాస్ హీరోగా దర్శకుడు గోపి తెరకెక్కించిన కామెడీ చిత్రం 'హే భగవాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో చాలామంది మహిళలు చీరల్లోనే కనిపిస్తున్నారని అన్నారు. అలా ఉండటం భారతీయ సంస్కృతి అని వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం నటుడు శివాజీ ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నరేశ్ పైవిధంగా అన్నట్టు తెలుస్తోంది.

వాలంటైన్ వీక్‌లో భాగమైన 'హగ్ డే' సందర్భంగా నరేశ్ వేదికపై ఉన్న పురుషులను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈ చిత్రం హీరోయిన్ శివాని, యాంకర్ స్రవంతి వద్దకు వెళ్లిన నరేశ్ మాట్లాడుతూ, మిమ్మల్ని కూడా హగ్ చేయాలని వచ్చాను... కానీ మీరు లక్షణంగా చీరలు ధరించి వచ్చారు, కొన్ని పరిణామాల వల్ల చాలామంది సినిమా వేదికలకు చీరలు ధరించి వస్తున్నారు అని అన్నారు. కాగా ఈ చిత్రంలో యాంకర్ స్రవంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.
Naresh
Naresh actor
Hey Bhagavan
Suhas
Shivani
Anchor Sravanthi
Telugu cinema
Tollywood

More Telugu News