Chandrababu Naidu: విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ గుండెపోటుతో మృతి .. సీఎం చంద్రబాబు సంతాపం

Chandrababu Naidu Condoles Death of SI Srinivasarao
  • విజయవాడ దసరా ఉత్సవాల్లో బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ శ్రీనివాసరావు
  • గుండెపోటుతో శ్రీనివాసరావు మృతి
  • ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్‌పెక్టర్ వడ్డాది శ్రీనివాసరావు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. విజయవాడలో దసరా నవరాత్రుల బందోబస్తు విధులకు హాజరైన విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ వడ్డాది శ్రీనివాసరావు ఆకస్మికంగా మరణించారు.

ఎస్ఐ శ్రీనివాసరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. 57 సంవత్సరాల శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించడం విచారకరమని ఆయన అన్నారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 
Chandrababu Naidu
Vaddadi Srinivasa Rao
Andhra Pradesh
Sub Inspector
Heart Attack
Dussehra
Vijayawada
Pusapatirega
Police
AP CM

More Telugu News