Andhra Pradesh State Aquacuture Development Authority: ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం – 9 మంది సభ్యుల నియామకం

Andhra Pradesh Government Appoints 9 Members to APSADA
  • ఆక్వా కల్చర్ అభివృద్ధి ప్రాదికార సంస్థ సభ్యులను నియమించిన ప్రభుత్వం
  • మత్స్యపరిశ్రమకు సంబంధించి విభిన్న రంగాల ప్రముఖులకు చోటు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (APSADA) సభ్యుల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ జిల్లాల నుండి, మత్స్య పరిశ్రమకు సంబంధించిన విభిన్న రంగాల ప్రముఖులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది.

సభ్యులుగా నియమితులైన వారిలో దేశంసెట్టి వెంకట లక్ష్మీ నారాయణ (అమలాపురం, ప్రాసెసింగ్ ప్లాంట్లు విభాగం), గుట్టికొండ శ్రీ రాజబాబు (గుడివాడ, ఫీడ్ తయారీదారులు), లంకే నారాయణ ప్రసాద్ (మచిలీపట్నం, ఫిష్ ఫార్మర్), మొహమ్మద్ నూరుద్దిన్ (ఉంగుటూరు, ఫిష్ ఫార్మర్), నాగశ్రీనివాస్ విత్తనాల (ముమ్మిడివరం, హాచరీలు), రాచమల్ల మీరయ్య (పాలకోలు, శ్రింప్ ఫార్మర్), వంక కొండ బాబు (పిఠాపురం, శ్రింప్ ఫార్మర్), వేగేశ్న సాయి మనోహర్ రాజు (అచంట, శ్రింప్ ఫార్మర్), వేగేశ్న సత్యనారాయణ రాజు (ఉండి, ఆక్వాకల్చర్ హెల్త్ కేర్ ఉత్పత్తుల డీలర్)లు ఉన్నారు. 
Andhra Pradesh State Aquacuture Development Authority
APSADA
Aquaculture Andhra Pradesh
Fisheries Andhra Pradesh
Shrimp farming Andhr

More Telugu News