బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి అరెస్టు
- మెట్రో రైలు రెండో దశ విషయంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన
- శిలాఫలకం వద్ద నిరసన తెలుపుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను కేసీఆర్ హయాంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్మించాలని కోరుతూ కార్తీక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకం వద్ద వారు నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద కార్తీక్ రెడ్డిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టుకు ముందు కార్తీక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన రెండో దశ మెట్రో పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.