జొమాటోలో సరికొత్త ఫీచర్.. ‘హెల్తీమోడ్’

  • ఆహారంలోని పోషక విలువల వివరాలతో రేటింగ్
  • ప్రస్తుతం గురుగ్రామ్ లో అందుబాటులోకి..
  • త్వరలోనే దేశంలోని మిగతా నగరాల్లో అమలు
పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునే వీలు కల్పించేలా జొమాటో సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీలో రంగంలో ప్రముఖ సంస్థగా కొనసాగుతున్న జొమాటో... తన వినియోగదారులు ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకునేందుకు ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ‘హెల్తీమోడ్’ పేరుతో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ లోని ఆహార పదార్థాలను ఎంచుకునే ముందు వాటిలోని పోషక విలువల రేటింగ్ ను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ ఫీచర్ ను పరిచయం చేస్తూ జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తాజాగా ట్వీట్ చేశారు.

ప్రతీ వంటకానికీ ఓ స్కోర్..
"ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం గురించి వినియోగదారుడికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. నచ్చిన ఆహారాన్ని ఇంటి వద్దకు తెప్పించుకునేందుకు జొమాటో ఉపయోగపడుతోంది. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు తోడ్పడాలనేది జొమాటో ఉద్దేశం. హెల్తీమోడ్‌ లోని ప్రతీ వంటకానికి ఒక స్కోర్ ఉంటుంది. ప్రొటీన్లు, కాంప్లెక్స్‌ కార్బ్స్‌, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్‌ ఆధారంగా లో-సూపర్‌ స్కోర్ కనిపించనుంది. ప్రస్తుతానికి హెల్తీమోడ్ గురుగ్రామ్‌ లో అందుబాటులోకి వచ్చింది. మిగతా నగరాల్లో తొందర్లోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ హెల్తీమోడ్ లో ఏవైనా లోపాలు ఉంటే చెప్పండి. మా మిషన్‌..‘బెటర్ ఫుడ్‌ ఫర్ మోర్‌ పీపుల్‌’ లక్ష్యానికి ఇది దగ్గరగా ఉందని నేను భావిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.


More Telugu News