టాటా గ్రూప్ ఐపీఓకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
- ఈక్విటీ షేరుకు కనీస ధర రూ. 310 గరిష్ఠ ధర రూ.326
- అక్టోబర్ 13న టాటా క్యాపిటల్ లిమిటెడ్ లిస్టింగ్
- ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుందని నిపుణుల వెల్లడి
జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఐపీఓల ట్రెండ్ మొదలైంది. వరుసగా పెద్ద పెద్ద ఐపీఓలు సందడి చేస్తున్నాయి. తాజాగా టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 6 నుంచి 8 తేదీల మధ్య సబ్‌స్క్రిప్షన్ జరగనుందని టాటా గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఐపీఓ ద్వారా రూ.17,200 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 9న షేర్ల అలాట్‌మెంట్ జరగనుండగా.. అక్టోబర్ 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం మేరకు ఈ ఏడాది దేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓగా అవతరించే అవకాశం ఉంది.
షేర్ల ధరల వివరాలు..
సోమవారం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఈక్విటీ షేర్ల ధరలను ప్రకటించింది. రూ. 10 ముఖ విలువతో జారీ చేసే ఈ షేర్ల కనీస ధర రూ.310 కాగా గరిష్ఠ ధర రూ.326 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో లాట్ కింద కనీసం 46 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాలి. అంటే.. కనీసం రూ.14,260 (310x46), గరిష్ఠ ధర వద్ద రూ.14,996 (326x46) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఐపీఓలో ఎవరికెన్నంటే..
దాదాపు 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు, 15 శాతం ఎన్ఐఐలకు, 35 శాతం కంటే తక్కువ షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఎంప్లాయీ పోర్షన్ కింద 12,00,000 షేర్లు కేటాయించారు.