అందుకే ఆ కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నా: సీపీఐ నారాయణ

  • వయసు 75 ఏళ్లు నిండటంతోనే సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నానన్న కె నారాయణ
  • వయసు నిబంధనలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మినహాయింపు ఇచ్చారని వెల్లడి
  • పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారానికే కంట్రోల్ కమిషన్ ఏర్పాటయిందన్న నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి నుంచి సీనియర్ నేత కె. నారాయణ తప్పుకున్న విషయం విదితమే. ఆయన ఇటీవల సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ కీలక పదవి నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇచ్చారు.

తన వయసు 75 ఏళ్లు నిండటంతోనే సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నట్లు కె. నారాయణ తెలిపారు. ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘75 ఏళ్లు నిండిన నేతలు కీలక పార్టీ పదవుల్లో కొనసాగకూడదని చండీగఢ్‌లో జరిగిన జాతీయ మహాసభలలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిబంధన నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అందుకే ఆ పదవిలో డి. రాజా కొనసాగుతున్నారు," అని నారాయణ తెలిపారు.

కంట్రోల్ కమిషన్ ఏర్పాటుపై స్పష్టతనిస్తూ, పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడానికి కంట్రోల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పుడు తనకు ఆ బాధ్యత అప్పగించారని నారాయణ పేర్కొన్నారు. 


More Telugu News