టికెట్ ధరలు పెంచొద్దు సార్.. చిన్న నిర్మాతలు నష్టపోతారు: నారాయణమూర్తి

  • సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి
  • ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో చర్చలు జరపాలని సూచన
  • సినిమా టికెట్ ధరల పెంపు సామాన్యుడికి భారమన్న నారాయణమూర్తి
  • రేట్ల పెంపుతో చిన్న నిర్మాతలు కూడా నష్టపోతారని ఆవేదన
  • టికెట్ ధరలు పెంచనన్న సీఎం రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేస్తున్నా
  • ఇచ్చిన మాటపైనే నిలబడాలని ముఖ్యమంత్రిని కోరిన నారాయణమూర్తి
సినిమా టికెట్ల ధరల పెంపును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. "టికెట్ ధరలు పెంచను, మిడ్ నైట్ షోలను అనుమతించను అని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేస్తున్నా. దయచేసి ఇదే మాట మీద నిలబడాలని కోరుతున్నా" అని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు తీవ్రంగా ఇబ్బంది పడతారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. "సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఏకైక వినోదం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ రేట్లు పెంచితే వారు వినోదానికి దూరమవుతారు. అంతేకాకుండా, ఈ ధరల పెంపు వల్ల పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరవచ్చేమో కానీ, చిన్న చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దయచేసి టికెట్ ధరలు పెంచవద్దు సార్" అని ఆయన ప్రభుత్వాలను కోరారు.


More Telugu News