బీసీ రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టుకు మాధవరెడ్డి

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్
  • హౌస్ మోషన్ పిటిషన్‌కు అనుమతి కోరిన పిటిషనర్
  • హైకోర్టు రిజిస్ట్రీ పరిధిలో ఉన్న పిటిషన్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ... మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ విడుదలైన జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్‌కు అనుమతి కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిధిలో ఉంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ మూడు రోజుల క్రితమే మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్‌ను విచారించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిన్న జీవో విడుదల కావడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.


More Telugu News