నర్సంపేటలో ఆవుకు సీమంతం.. బంధుమిత్రులను పిలిచి ఘనంగా వేడుక
––
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లిలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్, ఆయన భార్య తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్న ఆవు గర్భం దాల్చడంతో బంధుమిత్రులను పిలిచి ఘనంగా సీమంతం నిర్వహించారు. సురేందర్ గోపాలమిత్రగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం హనుమకొండలోని మహర్షి గోశాల నుంచి ఆయన ఒక ఆవుదూడను స్వీకరించారు.
ఆడపిల్లలు లేని లోటును పూడ్చుకోవడానికి ఆ ఆవుదూడకు గౌరి అని పేరుపెట్టి కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నారు. ఇటీవల గౌరి గర్భం దాల్చడంతో సొంత కూతురుకు జరిపించినట్లు సీమంతం జరిపించారు. బంధుమిత్రులను ఆహ్వానించి శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించారు. ఐదు రకాల పిండి వంటకాలు, పండ్లు, పూలను ముత్తయిదువలతో ఆవుకు పెట్టించారు. గోమాత ప్రాముఖ్యం అందరికీ తెలిసేలా ఈ వేడుకను నిర్వహించామని సురేందర్ తెలిపారు.