ఓ ఇంటివాడు కానున్న అల్లు శిరీశ్? .. సోషల్ మీడియాలో భారీ ప్రచారం!

  • ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం నిశ్చయం?
  • ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు పూర్తయ్యాయంటూ ప్రచారం
  • అల్లు కనకరత్నం మరణంతో తాత్కాలికంగా పెళ్లి పనులకు బ్రేక్
  • త్వరలోనే నిశ్చితార్థం అంటూ టాలీవుడ్‌లో టాక్ 
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీశ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీశ్ వివాహాన్ని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల వారు ఈ విషయంపై చర్చలు జరిపారని, పెళ్లికి అంగీకారం తెలిపారని టాక్‌ నడుస్తోంది. నిజానికి ఈ పెళ్లి ప్రక్రియ కొన్ని రోజుల క్రితమే మొదలైనప్పటికీ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణించడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇప్పుడు కుటుంబం ఆ విషాదం నుంచి కోలుకోవడంతో, పెళ్లి పనులను తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేసే పనిలో పెద్దలు ఉన్నారని అంటున్నారు. అల్లు అరవింద్‌కు ముగ్గురు కుమారులు కాగా, పెద్ద కుమారులు అల్లు బాబీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లకు ఇప్పటికే వివాహాలై పిల్లలు కూడా ఉన్నారు. ఇక శిరీశ్ కూడా పెళ్లి చేసుకుంటే అల్లు వారింట పెళ్లిళ్లన్నీ పూర్తయినట్లే.

అయితే ఈ వార్తలపై అటు అల్లు కుటుంబం నుంచి గానీ, ఇటు శిరీశ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


More Telugu News