బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసుడే కాదు: జోగి రమేశ్
- బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మాజీ మంత్రి జోగి రమేశ్
- చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శ
- భావప్రకటనా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపణ
బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసుడే కాదని, ఆయన నారా వారి వారసుడని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాపరెడ్డిని పరామర్శించిన అనంతరం జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలోకి మ్యాన్షన్ హౌస్ తీసుకురావచ్చా?" అని ప్రశ్నించిన జోగి రమేశ్, బాలకృష్ణ తీరుపై మండిపడ్డారు. బాలకృష్ణ నిజంగా నందమూరి వారసుడైతే, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదని, ఎప్పుడో చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని ఆయన విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని జోగి రమేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై పోస్ట్ పెట్టినందుకే సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాపరెడ్డిని అరెస్ట్ చేశారని, ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, వాటిని కూడా ఈ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు.
ఇదే సందర్భంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలన్నీ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం" అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోగి రమేశ్ తో పాటు గుంటూరు వైసీపీ నేత నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.