రేపటి నుంచి ఓటీటీ తెరపైకి అనుష్క 'ఘాటి'

  • అనుష్క ప్రధాన పాత్రగా 'ఘాటి'
  • ఈ నెల 5వ తేదీన విడుదలైన సినిమా
  • నెల తిరగకముందే ఓటీటీకి 
  • రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో 
  • తమిళ .. మలయాళ .. కన్నడ  భాషల్లోను అందుబాటులోకి  

అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'ఘాటి'. ఫస్టు ఫ్రేమ్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు తెలుగులో నేరుగా చేసిన సినిమా ఇది. జగపతిబాబు .. జిషు సేన్ గుప్త .. చైతన్యరావు .. రవీంద్ర విజయ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. 

అనుష్కకి ఉన్న క్రేజ్ వేరు. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా వస్తుందని అంటే ఆడియన్స్ చూపించే ఆసక్తివేరు. తన తాజా చిత్రంగా అనుష్క చేసిన 'ఘాటి' ఇదే విషయాన్ని నిరూపించింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విద్యాసాగర్ సంగీతాన్ని అందించాడు. నెల తిరగకముందే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కథ విషయానికి వస్తే నాయుడు బ్రదర్స్ గంజాయి అక్రమ రవాణ చేస్తుంటారు. ఆ గంజాయిని మోసే ఘాటీలుగా శీలావతి .. దేశిరాజు పనిచేస్తూ ఉంటారు.  తాము చేస్తున్న పని సరైనది కాదని తెలియగానే వాళ్లిద్దరూ మనసు మార్చుకుంటారు. ఫలితంగా వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.



More Telugu News