వారిని నేను ఆహ్వానిస్తున్నా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
- రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పని చేసి విజయం సాధించామన్న కవిత
- తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపు
- జాగృతిలో చేరే కొత్తవారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ
ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని కవిత అన్నారు. పునరేకీకరణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడి తాము పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లావాసులను ఆమె సాదరంగా ఆహ్వానించారు.
జాగృతిలో ఇదివరకే ఉన్న నాయకత్వంతో పాటు, కొత్తగా చేరుతున్న వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంతో సహా నగరంలోని హైడ్రా బాధితులైన పేదల తరఫున తాము పోరాడుతామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.