అడవిలో అన్వేషణ .. ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్!

  • క్రైమ్ థ్రిల్లర్ గా 'జనావర్'
  • 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
  • అడవి నేపథ్యంలో సాగే కథ  
  • ప్రధానమైన పాత్రలో భువనన్ అరోరా 
  • ఈ నెల 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్      

ప్రతివారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి డిఫరెంట్ జోనర్స్ నుంచి కంటెంట్ దిగిపోతూ ఉంటుంది. అయితే థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువ మార్కులు కొట్టేస్తూ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ లకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో  హిందీ నుంచి ఇప్పుడు ప్రేక్షకులను పలకరించడానికి ఒక భారీ వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది .. ఆ సిరీస్ పేరే 'జనావర్'.

ఈ సిరీస్ ను ఈ నెల 26వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 8 ఎపిసోడ్స్ గా ఈ  సిరీస్ అందుబాటులోకి రానుంది. దినేశ్ .. అభిషేక్ .. హరీశ్ నిర్మించిన ఈ సిరీస్ కి, శచింద్ర దర్శకత్వం వహించాడు. భువన్ అరోరా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, భగవాన్ తివారీ .. అతుల్ కాలే .. వైభవ్ యశ్వీర్ .. ఎషికా డే .. వినోద్ సూర్యవంశీ ..  అమిత్ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

అది ఒక దట్టమైన అడవి .. ఆ అడవిలో తలలేని ఒక మొండెం ఉన్నట్టుగా ఒక సమాచారం బయటికి వస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ హేమంత్ కుమార్ రంగంలోకి దిగుతాడు. ఆ మొండెం ఎవరిది?  హంతకుడు ఎవరు? కనుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇది తాను అనుకున్నంత తేలికైన కేసు కాదనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ. 



More Telugu News