సొంత ప్రజలను చంపడం అయిపోతే ఇక ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టండి.. పాక్ కు భారత్ హితవు
- ఐరాస మానవ హక్కుల వేదికపై పాక్ తీరును ఎండగట్టిన వైనం
- ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సొంత ప్రజలపైనే బాంబులు వేస్తోందని ఫైర్
- మాపై నిరాధార ఆరోపణలు మాని వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటూ ఎద్దేవా
దాయాది పాకిస్థాన్ తీరును భారత్ మరోమారు ఎండగట్టింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల వేదికపై పాక్ పై మండిపడింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సొంత ప్రజలపైనే బాంబు దాడులు చేస్తోందని విమర్శించింది. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడిని ప్రస్తావిస్తూ.. ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలు తీస్తోందని తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు మంగళవారం జరిగిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేదికపై భారత ప్రతినిధి క్షితిజ్ త్యాగి పాక్ తీరును ఎండగట్టారు.
భారత్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం రెచ్చగొట్టడమే పాకిస్థాన్ పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఓవైపు దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మరణశయ్యపైకి చేరినా పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ఆపడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మాని వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలంటూ పాక్ కు హితవు పలికారు.