కాలిఫోర్నియాలో 'తాల్ హాస్పిటల్స్ ఫెస్ట్'... కేటీఆర్‌కు ఆహ్వానం
- కేటీఆర్‌ను కలిసి స్వయంగా ఆహ్వానించిన సీఈవో శ్రీసాయి
- అక్టోబర్ 24న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోలో హెల్త్ ఫెస్ట్
- కీలకోపన్యాసం చేయనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌కు 'తాల్ హాస్పిటల్స్ ఫెస్ట్ 2025'కు ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు తాల్ హాస్పిటల్స్ సీఈవో శ్రీ సాయి గుండవెల్లి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోలో ఈ హెల్త్ ఫెస్ట్ 2025ను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకువచ్చే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్ కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు.