ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన యువరాజ్ సింగ్

  • మధ్యాహ్నం 12 గంటలకు న్యాయ బృందంతో కలిసి విచారణకు హాజరైన యువీ
  • సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయంలో వాంగ్మూలం ఇచ్చిన యువరాజ్
  • అంతకుముందు ఈడీ ఎదుట హాజరైన ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈడీ ఎదుట హాజరయ్యాడు. మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. తెలుపు రంగు టీ-షర్ట్, ప్యాంట్ ధరించిన యువరాజ్ సింగ్ తన న్యాయ బృందంతో కలిసి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నాడు.

ఈ కేసులో యువరాజ్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు అన్వేషి జైన్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరైంది.

ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ కొన్ని వారాలుగా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్పలతో పాటు మాజీ టీఎంసీ ఎంపీ-నటుడు మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా తదితరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు కూడా ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. అతను రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.


More Telugu News