తిరుమల శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ ఎంపీ

  • శ్రీవారికి రూ.60 లక్షల విలువైన స్వర్ణాభరణం సమర్పణ
  • 535 గ్రాముల బరువున్న స్వర్ణాభరణం
  • రంగనాయకుల మండపంలో ఆభరణాన్ని స్వీకరించిన అధికారులు
  • వివరాలు వెల్లడించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు.

ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువున్న "అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి" అనే స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పించినట్లు ఆయన తెలిపారు.

తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తాము ఈ విరాళాన్ని స్వీకరించినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.


More Telugu News