9,600 స్కూళ్లలో తరగతికో టీచర్.. దేశంలోనే ఇది రికార్డ్: మంత్రి నారా లోకేశ్
- 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియామకం
- దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో అమలు కాలేదన్న మంత్రి
- విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు చాగంటి కోటేశ్వరరావు సలహాదారుగా నియామకం
- ప్రభుత్వం నుంచి చాగంటి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదన్న లోకేశ్
- ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం కోర్టు పరిధిలో ఉందని వెల్లడి
- ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9,600 ప్రాథమిక పాఠశాలల్లో 'తరగతికి ఒక ఉపాధ్యాయుడు' విధానాన్ని అమలు చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఈ ఘనత సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో జీవో 117 కారణంగా కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే తరగతికో టీచర్ అందుబాటులో ఉండేవారని లోకేశ్ గుర్తుచేశారు. అయితే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంఖ్యను 9,600కు పెంచిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం (FLN)లో విద్యార్థులు గ్యారెంటీగా నైపుణ్యం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
నైతిక విలువల కోసం చాగంటి సేవలు
విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా చాగంటి నిస్వార్థ సేవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. "చాగంటి గారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. కనీసం ఫోన్ గానీ, వాటర్ బాటిల్ గానీ స్వీకరించడం లేదు. ఆయన రూపొందించిన అద్భుతమైన పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకు అందిస్తున్నాం" అని లోకేశ్ ప్రశంసించారు.
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కమిటీ (APSERMC) చట్టం-2019కి సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని మంత్రి తెలిపారు. ఇక, ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎక్కడైనా సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి చర్యలను ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జాతీయ విద్యా ప్రమాణాల సర్వే (న్యాస్) నివేదికను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని లోకేశ్ పునరుద్ఘాటించారు.