బస్సు కోసం ఎదురుచూస్తున్న బాలిక కిడ్నాప్.. వెంటాడి కాపాడిన గ్రామస్థులు.. మధ్య ప్రదేశ్ లో ఘటన
- బొలెరోలో వచ్చి బాలికను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు
- బైక్ లు, కార్లపై కిడ్నాపర్లను వెంబడించిన గ్రామస్థులు
- 20 కిలోమీటర్లు సాగిన ఛేజింగ్.. చివరకు బాలికను వదిలేసి పరారైన కిడ్నాపర్లు
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలుచుని బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు.. చుట్టూ జనం ఉన్నా వెరవకుండా బాలికను కిడ్నాప్ చేసి పారిపోయారు. దీంతో వెంటనే స్పందించిన గ్రామస్థులు బైక్ లు, కార్లపై కిడ్నాపర్లను వెంబడించారు. దాదాపు 20 కిలోమీటర్ల పాటు ఛేజింగ్ సాగింది.
మేకల మంద అడ్డురావడంతో కిడ్నాపర్ల వాహనం ఆగిపోయింది. దీంతో బాలికను, తమ వాహనాన్ని అక్కడే వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఇంతలో అక్కడికి చేరుకున్న గ్రామస్థులు బాలికను కాపాడారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. కిడ్నాపర్లపై ఆగ్రహంతో గ్రామస్థులు బొలెరో వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనాన్ని ఎత్తి బోల్తా పడేశారు. కాగా, గ్రామస్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కిడ్నాపర్ల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.