Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోరులేని జీవిపై పైశాచికం.. గేదె దూడపై యువకుడి అఘాయిత్యం

Medak Youth arrested for bestiality caught on CCTV
Advertisement
  • మెదక్ జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
  • ఏడాది వయసున్న గేదె దూడపై యువకుడి అత్యాచారం
  • సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడ్డ అఘాయిత్యం
  • నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన యజమాని
  • పోలీసులకు అప్పగింత, కేసు నమోదు  
Advertisement
సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. కామాంధుల వికృత చేష్టలకు అభం శుభం తెలియని చిన్నారులే కాదు, నోరులేని మూగజీవాలు కూడా బలవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి గేదెలపై అత్యాచారం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే, మెదక్ జిల్లాలో అలాంటిదే మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పశువుల పాకలో కట్టేసి ఉన్న ఏడాది వయసున్న గేదె దూడపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడి బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాములు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని షెడ్డులో పశువులను పెంచుకుంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం కూడా తన పశువులను షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్లారు. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన రోహిత్ అనే యువకుడు, ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎవరూ లేని సమయం చూసి షెడ్డులోకి ప్రవేశించాడు. అక్కడ కట్టేసి ఉన్న ఏడాది వయసున్న గేదె దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అయితే, పశువుల పాకలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ వికృత చేష్టను యజమాని సిద్దిరాములు గమనించారు. వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని నిందితుడు రోహిత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూగజీవాలపై ఇలాంటి పైశాచిక దాడులు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Advertisement
Advertisement
Buffalo Calf
Rohit
Medak district
Sexual assault
Animal cruelty
Telangana crime
Mirzapur
Siddiramulu
CCTV footage
Bestiality

More Telugu News