మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని పరామర్శించిన జగన్

  • పుత్ర వియోగంతో బాధపడుతున్న బాబ్జీకి జగన్ ఫోన్
  • శనివారం గుండెపోటుతో కన్నుమూసిన బాబ్జీ కుమారుడు
  • ఈరోజు అంత్యక్రియలు పూర్తి
పుత్ర వియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్న పాలకొల్లు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (బాజ్జీ)ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. డాక్టర్ బాజ్జీకి ఫోన్ చేసిన ఆయన, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. డాక్టర్ బాజ్జీ కుమారుడు అంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు

డాక్టర్ బాజ్జీ ఏకైక కుమారుడైన డాక్టర్ అంజన్ (53) గత శనివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. డాక్టర్ అంజన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

శనివారం మరణించినప్పటికీ, డాక్టర్ అంజన్ అంత్యక్రియలను ఈరోజు నిర్వహించారు. అంజన్ కుమారుడు విదేశాల నుంచి తిరిగి రావడంలో జాప్యం జరగడమే ఇందుకు కారణం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


More Telugu News