తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Telangana Weather Yellow Alert Issued for Several Districts
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, ఇవాళ‌ ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

ఈ జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఇక, రేపు సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Telangana Rains
Telangana Weather
Hyderabad weather
Yellow alert
Rain alert
Heavy rainfall
Weather forecast Telangana
IMD Hyderabad
Monsoon Telangana

More Telugu News