Nagarjuna: 'అలయ్ బలయ్' కి నాగార్జునను ఆహ్వానించిన దత్తన్న

Nagarjuna Invited to Alai Balai by Dattanna
  • ప్రతి ఏటా దసరా నాడు అలయ్ బలయ్ వేడుకను నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ
  • అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రాన్ని అందించిన దత్తాత్రేయ
  • అక్టోబర్ 3న జరగనున్న అలయ్ బలయ్
అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానం పలికారు. దత్తాత్రేయ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లి నాగార్జునను ఆహ్వానించారు.

ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా హైదరాబాద్‌లో దత్తాత్రేయ సంప్రదాయబద్ధంగా అలయ్ బలయ్ వేడుకలను నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. పండుగ సందర్భంగా మత సామరస్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

కుల, మత, వర్గ, రాజకీయ విభేదాలు విస్మరించి అందరూ ఒక్కచోట చేరడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి అక్టోబర్ 3న ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దత్తాత్రేయ తాజాగా అక్కినేని నాగార్జునను కలిసి ఆహ్వానించారు. 
Nagarjuna
Alai Balai
Bandaru Dattatreya
Telangana
Hyderabad
Annapurna Studios
Dasara
Revanth Reddy
Telangana Politics
Cultural Event

More Telugu News