విచారణలో మిథున్ రెడ్డి దాటవేత ధోరణి

  • 50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు
  • ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ
  • మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. కోర్టు అనుమతితో అధికారులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడకు తరలించారు. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు ఆయనకు 50కి పైగా ప్రశ్నలు సంధించారు.

రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మిథున్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. కాగా, మిథున్ రెడ్డిని అధికారులు రెండోరోజు శనివారం కూడా విచారిస్తున్నారు. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.


More Telugu News