పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. మొదలైన 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్!

  • పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'ఓజీ'
  • ఈ నెల‌ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా 
  • ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
  • సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన యాజమాన్యం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా సందడి మొదలైంది. సినిమా విడుదలకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ప్రారంభమయ్యాయి.

ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. టికెట్లు కావాల్సిన అభిమానులు, ప్రేక్షకులు http://prasadz.com/ అనే వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన‌ ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించారు. ‘ఓజీ’ చిత్రం ఈ నెల‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


More Telugu News