వయసు, దుస్తుల గురించి ప్రశ్న.. జర్నలిస్టుపై ఫిలిం ఛాంబర్‌లో మంచు లక్ష్మి ఫిర్యాదు
- ఓ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన నటి మంచు లక్ష్మి
- ఇంటర్వ్యూలో తన గౌరవానికి భంగం కలిగించారని ఆరోపణ
- తన వయసు, దుస్తుల గురించి అడగడంపై తీవ్ర అభ్యంతరం
- అది ఇంటర్వ్యూ కాదు, తనపై జరిగిన దాడి అని ఆవేదన
- సంబంధిత జర్నలిస్టుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్
- మౌనంగా ఉంటే ఇలాంటివి పునరావృతం అవుతాయని వెల్లడి
ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఒక జర్నలిస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్న తన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆమె ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. అది ఇంటర్వ్యూలా కాకుండా తనపై జరిగిన దాడిలా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ మంచు లక్ష్మి వయసు, ఆమె ధరించే దుస్తుల గురించి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగత హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది జర్నలిజం కాదని, కేవలం ప్రాచుర్యం పొందడం కోసం, వీడియో వైరల్ కావడం కోసమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ, "జర్నలిస్టుల మీద నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇది జర్నలిజం కాదు, కనీసం విమర్శ కూడా కాదు. పురుషాధిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి నిలదొక్కుకున్నాను.
ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటే, భవిష్యత్తులో కూడా ఇదే ప్రవర్తన కొనసాగుతుంది. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో ఆపాలని నిర్ణయించుకున్నాను" అని వివరించారు. ఈ నేపథ్యంలో, సదరు జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు.