జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. యాడ్ షూటింగ్‌లో ఘటన

  • హైదరాబాద్‌లో వాణిజ్య ప్రకటన షూటింగ్ 
  • ఎన్టీఆర్ ను వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన వ్యక్తిగత సిబ్బంది
  • ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్న సన్నిహిత వర్గాలు
  • సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తున్న అభిమానులు
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో కిందపడటంతో గాయమైంది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.

ఎన్టీఆర్‌కు చిన్న గాయమే అయిందని, అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎన్టీఆర్ అనారోగ్యంపై వచ్చే ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


More Telugu News