బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

  • హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అలాయ్ బలాయ్ వేడుకలు
  • ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఆహ్వానం
  • బ్రహ్మానందం ఇంటికి స్వయంగా వెళ్లిన బండారు దత్తాత్రేయ
  • ఆహ్వాన పత్రిక అందించి, వేడుకకు రావాలని కోరిన దత్తాత్రేయ
  • ప్రతి ఏటా దసరా సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణ
హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందంను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి బుధవారం స్వయంగా వెళ్ళిన దత్తాత్రేయ, 'అలయ్ బలయ్' కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ప్రతి సంవత్సరం దసరా పండుగను పురస్కరించుకుని బండారు దత్తాత్రేయ 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, కళాకారులను, మేధావులను ఒకే వేదికపైకి తీసుకువస్తారు. దత్తాత్రేయ ఆహ్వానం పట్ల బ్రహ్మానందం సానుకూలంగా స్పందించారు.


More Telugu News