నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

  • ఉదయం 11.45 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
  • స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, జీసీసీ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
  • రాత్రి 7.40 గంటలకు విశాఖ నుంచి అమరావతికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 11:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' పేరుతో నిర్వహించే పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సాగరికా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్న 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశమవుతారు. రాత్రి 7:40 గంటలకు విశాఖపట్నం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరతారు. 


More Telugu News